మోత్కూరు, మార్చి 26 : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు శ్రీరామ నవమి పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీరామ నవమి రోజున ప్రతి సంవత్సరం వైభవపేతంగా శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కల్యాణం నిర్వహించుకుంటామన్నారు. లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాల కోర్చిన శ్రీ సీతారాముల పవిత్ర బంధం అజరరామమైనదన్నారు. రాబోయే తరాలకు ఆదర్శనీయమన్నారు. సీతారాముల వారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. పరాభవ సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని శ్రీ సీతారామ చంద్రుల స్వామివారిని ప్రార్థించారు.