సిటీబ్యూరో: రుతుపవన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 1.48సెం.మీలు, కూకట్పల్లి రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో 1.28 సెం.మీలు, అల్వాల్ టెలీకామ్ కాలనీలో 1.1 సెం.మీలు, హైదర్నగర్లో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
కాగా, రాగల మరో రెండు రోజులు అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో ఉష్ణోగ్రతలు మరోసారి సాధారణ స్థాయిని చేరుకున్నాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.4 డిగ్రీలు, గాలిలో తేమ 76 శాతంగా నమోదైనట్లు తెలిపారు.