జిబ్లక్పల్లిలో వైభవంగా సీతారామ కల్యాణం
భూదాన్ పోచంపల్లి మండలంలోని జిబ్లక్పల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కోట మైసమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్ఠా, దేవాలయ పునర్నిర్మాణ..
భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 04 : భూదాన్ పోచంపల్లి మండలంలోని జిబ్లక్పల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కోట మైసమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్ఠా, దేవాలయ పునర్నిర్మాణ నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలను ధరింపజేసి శాస్త్రోక్తంగా వేద పండితులచే స్వామివారి కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ, ఒడి బియ్యం కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో పుర వీధులగుండా కొనసాగిన స్వామివారి రథోత్సవ కార్యక్రమం, భజన కీర్తనలు, కోలాటాల ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి.
నాభి శిల(బొడ్రాయి)కి మహిళలు భక్తిశ్రద్ధలతో జలాభిషేకం చేశారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో గ్రామ సర్పంచ్ ఆర్ల కావ్య వెంకటేశం, జిల్లా కాంగ్రెస్ నాయకుడు సామ మధుసూదన్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆర్ల లింగస్వామి యాదవ్, మాజీ సర్పంచ్ చిన్న లచ్చి లింగస్వామి, మాజీ ఎంపిటిసి సుర్కంటి జంగారెడ్డి, నాయకులు ఆమని కంటే చంద్రయ్య, పగడాల ఆంజనేయులు, వెంకటయ్య, నల్ల యాదగిరి, ముమ్మడి నరసింహాచారి, ఆర్ల ఐలయ్య, ప్రసాదం నరహరి, మీసాల నరసింహ, వార్డ్ మెంబర్లు శివ లీల చిరంజీవి, చినుకుని శంకరయ్య, కొమ్ము కిషన్, పగడాల జ్యోతి నరసింహ, మీసాల నర్మదా కృష్ణ, కడ మంచి శివ, ముమ్మడి నరసింహ చారి, తంగడపల్లి మమతా మల్లేష్, తంగడపల్లి కిష్టయ్య, భక్తులు పాల్గొన్నారు.

జిబ్లక్పల్లిలో వైభవంగా సీతారామ కల్యాణం
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

