రామన్నపేట, జనవరి28 : రామన్నపేట మండలంలోని సిరిపురం శ్రీ భ్రమరాంభిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సావాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ఆలయ చైర్మన్ ఏళ్ల నాగమణి బుచ్చిరెడ్డి తెలిపారు. ఈ 29న గణపతి, పుణ్యోహావాచనం, రక్షబంధనం, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజరోహణ పూజలు, 30న మహా రుద్రాభిషేకం, మంగళస్నానాలు, విశేష అలంకరణ, ఎదుర్కోలు ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు కల్యాణం, అన్నప్రసాద వితరణ, 31న పరివార దేవతల మూల మంత్ర హోమములు, చండి హోమం, త్రిశుల స్నానం, సాయంత్రం గ్రామ ఊరేగింపు కార్యక్రమం, ఫిబ్రవరి 1న హారతి, పవళింపు సేవలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.