రామన్నపేట, ఫిబ్రవరి 10 : రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సివిల్ సర్జన్, ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్, డాక్టర్ శ్వేతా ప్రియాంక మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్యులు , వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అందుబాటులో ఉన్న వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రత్యేక శ్రద్ధతో గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రసూతి సేవలను మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో సన్మానించారు.