భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 22 : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన భూదాన్ పోచంపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శివారెడ్డిగూడెం నుండి ఇంద్రియాల మీదుగా భువనగిరికి వెళ్తుండగా మరో ఆర్టీసీ బస్సు ఎదురుగా రావడంతో దాన్ని తప్పించబోయి అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లింది. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. గ్రామాల మధ్య రోడ్డు గుంతలతో అధ్వానంగా మారడంతో వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్నారని, రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.