రాజాపేట, అక్టోబర్ 06 : స్థానిక ఎన్నికల్లో రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సోమవారం గ్రామ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కలెక్టర్ హనుమంతరావు, తాసీల్దార్ అనిత, ఎంపీడీఓ నాగవేణికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించలేదని, ఉన్నతాధికారులు గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ అధ్యక్షుడు వెంకటాపురం అశోక్, మాజీ వార్డు సభ్యులు జంగా అంబేద్కర్, దుబ్బాసి రామచందర్, సరోజిని, ప్రకాష్, జంగ మల్లయ్య, జై భీమ్ నాయకులు పాల్గొన్నారు.