రాజాపేట, నవంబర్ 19 : రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు బుధవారం ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా రాజాపేటకు చెందిన సీడీఎఫ్‌డీ సీనియర్ సైంటిస్ట్ ఎలగందుల నరేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ డయాగ్నటిక్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సమాజంలో జరుగుతున్న నేరా నిరూపణలో ఫింగర్ ప్రింట్స్, డీఎన్ఏ ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా జరుగుతున్న నేరాలు, మార్పులపై శాస్త్రవేత్తలు వివరించారు. విద్యార్థులకు సొంత ఖర్చులతో ఎడ్యుకేషనల్ టూర్ నిర్వహించిన శాస్త్రవేత్త నరేశ్‌కు పాఠశాల హెచ్ఎం రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.