భూదాన్ పోచంపల్లి, మార్చి 23 : భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 27న జరిగే సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవమునకు గోటి తలంబ్రాలుకై (భద్రాచలం మాదిరిగా) వడ్ల నుండి బియ్యం వలిచే కార్యక్రమానికి శ్రీ పుండరీక భక్త సేవ సమాజం మహిళా సేవకులు సోమవారం హాజరయ్యారు. శ్రీరామ నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంతో వడ్ల నుండి బియ్యం వలిచారు. దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ బల్ల దుర్వాసులు, వార్డ్ ఆఫీసర్ చిలువేరు గీత, ఉపాధ్యక్షులు సకినాల నాగయ్య, ప్రధాన కార్యదర్శి జోగు లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శి వనం ఉభయాకర్, కోశాధికారి అంబటి భానుచందర్, ధర్మకర్తలు కొంక వీరేశం, విడం చక్రపాణి, బైరు లక్ష్మయ్య, సామల కైలాసం, గర్దాసు ఉప్పలయ్య, ఏరవ విగ్నేష్, చిట్టిమల్ల లక్ష్మీనారాయణ, గంజి చంద్రకళ, ఆడెపు ఎల్లమ్మ, భక్తులు పాల్గొన్నారు.

గోటి తలంబ్రాలులో పుండరీక భక్త సేవా సమాజం సేవకులు