భూదాన్ పోచంపల్లి, మార్చి 17 : భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామం పరిధిలోని కెమిక్ లైఫ్ సైన్సెస్ లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. కొంతమంది ఉద్యోగులకు 17 నెలలుగా, కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కంపెనీ యజమాన్యం ఫిబ్రవరి 2023 నుండి నేటివరకు పీఎఫ్ జమ చేయలేదని, అత్యవసర సమయంలో విత్ డ్రా చేసుకోలేకపోతున్నట్లు వాపోయారు. వేతనాలు ఇప్పించాలని కోరుతూ నల్లగొండ లేబర్ ఆఫీస్, లేబర్ కమిషనర్ రంగారెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కార్మికులు తెలిపారు.