బీబీనగర్, జనవరి 26 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ మండలంలోని మహాదేవపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆకుల ప్రసన్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా ఎలిమినేటి ఉమాకు రూ.5 వేలు, రెండో బహుమతిగా వెంగల సోనికి రూ.2,500, మూడో బహుమతిగా మహమ్మద్ సహనకు రూ.1,000 అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవరకొండ వేణుగోపాల్, నాయకులు మూల స్వామి, దండెం జహంగీర్, వెంగల భాస్కర్ రెడ్డి, దేవరకొండ రమేష్, ఆకుల ప్రవీణ్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పచ్చిమట్టల వంశీ గౌడ్, ఆకుల అఖిల్, ఆకుల సాయి కుమార్, మునిగాల మధు, వెంగల భాను, మునిగాల ప్రసాద్ పాల్గొన్నారు.