అరుదైన వైద్య చికిత్సతో గర్భిణికి ప్రాణదానం
చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన ఏడున్నర నెలల గర్భిణి (27)కి అరుదైన వైద్య చికిత్స నిర్వహించి వైద్యులు ప్రాణాలను కాపాడారు. తీవ్ర కడుపునొప్పి, బీపీ పడిపోవడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ..
చౌటుప్పల్, మే 22 : చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన ఏడున్నర నెలల గర్భిణి (27)కి అరుదైన వైద్య చికిత్స నిర్వహించి వైద్యులు ప్రాణాలను కాపాడారు. తీవ్ర కడుపునొప్పి, బీపీ పడిపోవడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం ఆమెకు అత్యంత ప్రమాదకరమైన “ప్లాసెంటా పర్క్రేటా” కారణంగా గర్భాశయం చీలిపోయినట్లు గుర్తించారు. దీంతో పాటు తీవ్ర అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో గర్భంలోని శిశువు మృతి చెందింది. తక్షణమే ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వి.వి.జ్యోత్స్న నేతృత్వంలో వైద్యులు డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి, డాక్టర్ కలాధర్ ప్రత్యేక వైద్య చికిత్స నిర్వహించి మహిళ ప్రాణాలను కాపాడారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో గర్భసంచి తొలగించే పరిస్థితి వస్తుందని, అయితే ప్రత్యేక శస్త్రచికిత్సల ద్వారా గర్భసంచిని సంరక్షిస్తూ భవిష్యత్‌లో తిరిగి గర్భం దాల్చే అవకాశం ఉండేలా చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం హైవే-9 హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్య బృందం వెల్లడించింది.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

