రాజాపేట, మార్చి 22 : నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా హైదరాబాద్కు వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ సందిల భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపడానికి తరలి వెళ్తున్నతమను అరెస్ట్ చేయడం తగదన్నారు. అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. ఇలా అరెస్టు చేయడమేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు.