ఆలేరు టౌన్, మార్చి 4 : మార్చి 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్లో జరిగే 17వ అఖిలభారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయాలని ఆలేరు పట్టణ ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని బీసీ కాలనీ, మార్కండేయ కాలనీ, పోచమ్మ వా, సిల్క్ నగర్ తదితర కాలనీల్లో పద్మశాలి మహాసభ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్క పద్మశాలి మహాసభలకు హాజరై పద్మశాలీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రాజకీయ చదరంగంలో పద్మశాలి వాటాకై ఉద్యమించాలని కోరారు.
చట్టసభల్లో మన వాణిని వినిపించినప్పుడే పద్మశాలీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం రెండో స్థానంలో ఉందని అన్నారు. చేనేత రంగం అభ్యున్నతి కోసం, పద్మశాలీల ఐక్యత కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ నగర్ పద్మశాలి సంఘ అధ్యక్షులు బేతి వెంకటేష్, చేనేత కార్మిక సంఘ అధ్యక్షులు గట్టు రాజు ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీధర్, చింతకింది వెంకటేష్, రచ్చ లక్ష్మీనారాయణ, బేతి సత్తి, ఎలగందుల యాదగిరి, ఉపేందర్, చంద్రమౌళి, బేతి శ్రీనివాస్, బేతి లక్ష్మీనారాయణ, చేనేత కార్మికులు పాల్గొన్నారు.