భూదాన్ పోచంపల్లి, జూన్ 05 : గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో మున్సిపల్ ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులచే చెరువు కట్ట వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని, భవిష్యత్ తరాలను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు రాజేశ్, వార్డ్ ఆఫీసర్లు, మెఫ్మా సిబ్బంది, మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.