బీబీనగర్, సెప్టెంబర్ 19 : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని హైదరాబాద్ యాదాద్రి టోల్ ప్లాజా టీం లీడర్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రాజెక్ట్ హెడ్ చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం బీబీనగర్ మండల పరిధిలోని గూడూరు టోల్ ప్లాజా ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్హెచ్ఏఐ లక్ష్యాలకు అనుగుణంగా స్వచ్ఛమైన పచ్చదనంతో కూడిన వాతావరణాన్ని కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.