భూదాన్ పోచంపల్లి, జూన్ 03 : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి సదస్సు ఎంతగానో దోహద పడుతుందని చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని మెహర్ నగర్, జగత్పల్లి గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను స్వీకరించి పరిశీలించి పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. భూ భారతి చట్టం అప్పీలు వ్యవస్థను అమలు చేస్తుందని, భూ సమస్యలు ఉన్న రైతులందరూ సదస్సును వినియోగించుకోవాలన్నారు.
కొత్త పాస్ బుక్‌లో పేరు తప్పులు పడ్డా, నమోదు కాక, సాదా బైనామా కబ్జాలో ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం వెలువరించే మార్గదర్శకాలను అనుసరిస్తూ సాదాబైనామా పీఓటీలను క్రమబద్ధీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తాసీల్దర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ నాగేశ్వరరావు, ఎంఆర్ఐ లు గుత్తా వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాక మల్లేశ్ యాదవ్, నాయకులు ఏర్పుల శ్రీనివాస్, ఆకుల వెంకటేశ్, ఎటెందర్ రెడ్డి పాల్గొన్నారు.