బీబీనగర్, అక్టోబర్ 13 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎయిమ్స్‌లో అందే సేవలపై అవగాహన కల్పించాలని, బీబీనగర్ ఎయిమ్స్ వైద్య రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌ను అయన సందర్శించారు. ఎయిమ్స్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించి భోదన, హాస్టల్ వసతి, ఇతర సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపీ విభాగాన్ని పరిశీలించి రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిమ్స్ అభివృద్ధికి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాలకు చెందిన ప్రజలకు ఎయిమ్స్‌కు రావడానికి తక్కువ సమయం పడుతుందని, రానున్న కాలంలో ఎయిమ్స్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఓపి ద్వారా ప్రస్తుతం సుమారు 2 వేల మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారని, భవన నిర్మాణాలు పూర్తయితే ప్రతి నిత్యం 10 వేల మంది రోగులు వైద్య సేవలు పొందే ఆస్కారం ఉందన్నారు. ఎయిమ్స్‌కు ఆనుకుని జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ ఉందని అక్కడి నుండి వచ్చే ప్రజలకు ఎయిమ్స్ వరకు ప్రయానించడానికి బస్సులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఇక్కడ నుండి ప్రయానించే బస్సులు కూడా సర్వీసు రోడ్డు ద్వారా ప్రయానించాలని ప్రయానికులకు బస్ స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని అవి పూర్తయితే అందుబాటులోకి రావడానికి సంవత్సర కాలం పడుతుందన్నారు. ఎయిమ్స్‌లో చదివే వైద్య విద్యార్థులు దేశంలో మంచి సేవలు అందించి మంచిపేరు పొందాలన్నారు.
Bibinagar : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎయిమ్స్ సేవలపై అవగాహన కల్పించాలి : బండారు దత్తాత్రేయ
అనంతరం ఎయిమ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అహెంతం శాంటా సింగ్‌తో కలిసి ఎయిమ్స్ ఆవరణలో మొక్కను నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ అశోక్ నితిన్జాన్, డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ బిపిన్ వర్గీస్, మెడికల్ సూపరింటెండెంట్ లక్కిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ విశాక జైన్, సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవర్దన్, పీఆర్ఓ, ఓఎస్డీ డాక్టర్ మాడా ప్రశాంత్, నాయకులు బూర నర్సయ్యగౌడ్, ఉట్కూరి అశోక్‌గౌడ్, గూడూరు నరోత్తమ్‌రెడ్డి, భువనగిరి సదానందం గౌడ్, గోపాల్ రెడ్డి, కొలను లక్ష్మారెడ్డి, రామచందర్, కుమార్, కాసుల శ్రీకాంత్‌గౌడ్, వంశీగౌడ్, బ్రహ్మచారి పాల్గొన్నారు.
Bibinagar : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎయిమ్స్ సేవలపై అవగాహన కల్పించాలి : బండారు దత్తాత్రేయ