భువనగిరి కలెక్టరేట్, జూన్ 09 : పాఠశాల మధ్యాహ్న భోజన వంట కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇ్రమాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ర్రాష్ట కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావుకు వినతి ప్రతం అందజేసి మాట్లాడారు. పాఠశాలల ప్రారంభానికి రెండు రోజులే ఉందని, వంట కార్మికులకు గత సంవత్సరం వంట బిల్లులు, వేతనాలు, కోడిగుడ్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని, మరి ఇప్పుడు వంటలు ఎలా చేయాలో అధికారులు ఆలోచన చేయాలని కోరారు. 2023 అక్టోబర్ నెల నుండి అల్పాహారం బిల్లులు సైతం పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలిపారు.
రాగి జావ తయారికి ప్రతి విద్యార్థికి రూ,2 చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్య్రకమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్‌బాబు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బాగుల వసంత, జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్‌బేగం, నాయకులు అనసూర్య, పారిజాత, స్వేత, పూర్ణమా, రమ, లక్ష్మమ్మ, వరలక్ష్మి, రత్న, జాన్సీ, రూప, మున్ని, లక్ష్మి, రేణుక, వెంకటమ్మ, పారిజాత, పుష్ప, గంగమ్మ పాల్గొన్నారు.