ఆలేరు టౌన్,ఆగస్టు 7 : ప్రభుత్వం చేనేత రంగానికి పెద్ద పీట వేయాలని ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాశికంటి శ్రీనివాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక సిల్క్ నగర్ కాలనీ సమీపంలో గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చేనేత కళాకారులను చేనేత వస్త్రాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ..వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించి, చేనేత ఔన్నత్యాన్ని చాటాలన్నారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయా సాధన కోసం పద్మశాలీలు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు మాజీ పట్టణ అధ్యక్షులు బింగి నరసింహులు, ఆడెపు బాలస్వామి, బేతి రాములు, చిక్క శ్రవణ్ కుమార్, మెరుగు శ్రీధర్, చింతకింది ప్రకాష్, బడుగు జహంగీర్, మెరు కృష్ణ, ఎలా వెంకటేష్, చంద్రమౌళి, చింతకింది వెంకటేశ్వర్లు, గుజ్జ అశోక్, బేతి శ్రీనివాస్, చేనేత కళాకారులు తదితరులు పాల్గొన్నారు.