భువనగిరి అర్బన్: వ్యవసాయ రంగంలో నూతన విధానాన్ని అవలంభించి రైతులు అధిక లాభాలు పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భువనగిరి మండ లం వీరవెల్లి గ్రామంలో డ్రం సీడర్‌తో వరి సాగు విధానాన్ని గురువారం కలె క్టర్ పరిశీలించి మాట్లాడుతూ గ్రామానికి చెందిన యువ రైతు తయారు చేసిన డ్రం సీడర్ విధానంతో వరి సాగు చేయడం వల్ల కూటీల బెడద తప్పుతుందని, ఎకరానికి రూ.5 నుంచి రూ.8 వేలు రైతుకు ఆదా అవుతుందన్నారు.
ఈ కొత్త రకం యంత్రం రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని, దీనివల్ల రైతులకు కూలీల ఇబ్బందులు తొలగుతాయ న్నారు. రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ రంగంలో నూతన యంత్రాంగం అందుబాటులోకి వస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.
రైతు భీమా పధకం కోసం ఈ నెల 31 వరకు సంబంధిత వ్యవసాయ అధికారుల వద్ద దరకాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, దేవ్ సింగ్, మండల రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, రైతులు సిద్దారెడ్డి, సిలివేరు ఎల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.