రామన్నపేట, జులై 10 : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ఎస్ఐగా దూగుంట్ల నాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన మల్లయ్య మీర్పేట్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పని చేస్తున్న నాగరాజు రామన్నపేటకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు అంతా సహకరించాలని కోరారు. బదిలీపై వెళ్లిన ఎస్ఐ మల్లయ్యను పలువురు సన్మానించి వీడ్కోలు పలికారు.