యాదగిరిగుట్ట, మార్చి 27: యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్‌గా సీహెచ్.మురళీ కృష్ణ గురువారం బాద్యతలు స్వీకరించారు. గద్వాల్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పని చేసిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మేనేజర్ గా విధుల్లో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఎంజీబీఎస్ కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన డిపో మేనేజర్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వద్ద సేవలందించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి డిపోకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా డిపో సిబ్బంది ఆయనను శాలువతో సన్మానించి ఘన స్వాగతం పలికారు.