యాదాద్రి భువనగిరి, జులై 05 : బీఆర్ఎస్ పార్టీపై, నాయకులపై భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి పనికిమాలిన విమర్శలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ” బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి చూపిస్తా.. చూపిస్తా అని ఎంపీ చామల అంటున్నారు. ఏం చూపిస్తారు? మీకు చూపించాలని ఉంటే ఎస్ఎల్బీసీలో కూలిన శిథిలాల కింద ఇంకా తీయని శవాలను బయటకు తీసి చూపించండి. మీ ప్రభుత్వం అసమర్థత వల్ల శిథిలాల కింద చనిపోయిన మృతుల కుటుంబాలు కడసారి చూపునకు కూడా నోచుకోలేదు.”” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ఆస్పత్రిలో సంపూర్ణంగా అన్ని విభాగాలకు సంబంధించి ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభించి మీ దమ్మేంటో చూపించాలని సవాల్ విసిరారు. ఎంపీగా గెలిచిన 14 నెలలు కాలంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు. “లాగులు పగలగొడతా.. లాగులో తొండలు వదులుతా.. బట్టలూడదీస్తా… పేగులు బయటకు తీస్తా.. ఈ భాష ఎవరిదో..? ఈ భాషకు యజమాని ఎవరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని దుయ్యబట్టారు. మరోసారి బీఆర్ఎస్పై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.