Mother Dairy | మోత్కూరు: మూడు నెలలకు సంబంధించిన పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని ముషపట్ల గ్రామానికి చెందిన రైతులు బుధవారం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం గేటుకు తాళం వేసి రైతులు ఆందోళన నిర్వహించారు. పాల బిల్లులు చెల్లించాలని మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిని ఫోన్లో కోరగా.. గేట్లకు తాళాలు వేసి ఆందోళన చేస్తే సహించేది లేదని హెచ్చరించారని.. తమాషాలు చేయకుండా ఆందోళన విరమించాలని భయభ్రాంతులకు గురిచేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కవితతో పాటు పాడి రైతులు పాల్గొన్నారు.