Mandula Samuel | యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26 : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు మానుకుని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేసుకోవాలన్నారు. గురువారం భువనగిరిలో మీడియాతో మందుల సామేల్ మాట్లాడారు. మదర్ డైరీ ఎన్నికల్లో తమ జిల్లా నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు, మదర్ డైరీ చైర్మన్ మీకు బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టవద్దన్నారు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య తన పదవులకు రాజీనామా చేయాలన్నారు.
ప్రభుత్వ విప్‌గా ఉన్న బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని బొందపెట్టె ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడ్డారు. రేపు జరగబోయే మదర్ డైరీ ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చైర్మన్లను వేడుకుంటున్నట్లు చెప్పారు. ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు, మదర్ డైరీ చైర్మన్ జంగిలి పనులు, లఫంగ పనులు చేయకండని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఓడితే నాయకులు, కార్యకర్తలు వారికి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
బీర్ల ఐలయ్య రాజకీయ వ్యభిచారం మానుకో
కాంగ్రెస్ పార్టీలో ముసలం.. బీర్ల ఐలయ్య వర్సెస్ మందుల సామెల్
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు
బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చూస్తున్నాడు
మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు… https://t.co/p5CU2X5zQV pic.twitter.com/3xNmR1hmDe
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2025