రాజాపేట, నవంబర్ 17 : రాజాపేట మండలం చల్లూరులో బొంత సుధాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, వరి బీజము, బీజకుట్టు, గడ్డలు, కనతులు, థైరాయిడ్ గడ్డలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 140 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరమైన 40 మందిని గుర్తించారు. వారిని మెడిసిటీ హాస్పిటల్ కు తరలించి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించనున్నట్లు డాక్టర్ సాయిదీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సాయిదీప్, రియా, పల్లవి, మార్కెటింగ్ ఇన్చార్జి సుధాకర్, శేఖర్, రాకేశ్ పాల్గొన్నారు.