భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 16 : నూతనంగా నిర్మిస్తున్న ఇంటి స్లాబ్ కు వాటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి భవనం నుంచి కింద పడటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పెద్దగూడెం గ్రామానికి చెందిన పారిపల్లి కృష్ణారెడ్డి (53) సొంతింటి నిర్మాణం చేపట్టాడు. ఫస్ట్ ఫ్లోర్లో (ఇంటి స్లాబ్ ) క్యూరింగ్ కు వాటర్ పెడుతున్నాడు. ప్రమాదవశాత్తు కాలుజారి భవనం పైనుండి కింద ( సీసీ రోడ్ మీద) పడడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. ఇరుగుపొరుగు గమనించి చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. కృష్ణారెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.