భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 12 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కోరారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి, పెద్దగూడెం, జూలూరు, కప్రాయపల్లి, పెద్ద రావులపల్లి, గౌస్ కొండ, రామలింగంపల్లి, ఇంద్రియాల, దంతూరు, జిబ్లక్ పల్లి, కనుముకుల, భీమనపల్లి, హైదర్ పూర్, జలాల్ పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి, 420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ కు ఓటు వేసి ప్రజలు మోసపోయారని, రెండు సంవత్సరాలలో అభివృద్ధి ఏం జరగలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేక స్థానిక ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ పాక వెంకటేష్ యాదవ్, జిల్లా నాయకుడు కోట మల్లారెడ్డీ, సర్పంచ్ అభ్యర్థులు ఫకీరు ఇందిరా సుధాకర్ రెడ్డి, వట్టిపల్లి బాలరాజు, రాగీరు నర్మదా సత్యనారాయణ, పూల శేఖర్, ధరావత్ వెంకటేశ్, లింగాల మధు, మండల రెనమ్మ, బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్, సామ రవీందర్ రెడ్డి, కర్నాటి వరలక్ష్మి, ఆర్ల వెంకటేష్, నాయకులు రంగ విశ్వనాథం, అందెలా హరీష్, యాకరి నర్సింగ్ రావు, ఐతరాజ్ భిక్షపతి, నోముల మాధవరెడ్డి, బండి కృష్ణ గౌడ్, పెద్దిరెడ్డి యాదగిరి, గరిసే జంగయ్య, సిద్దగోని లింగస్వామి, సిలువేరు శేఖర్ పాల్గొన్నారు.