బీబీనగర్, ఏప్రిల్ 4 : బీబీనగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోకదాస్ ఉప్పలయ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, రైతు బంధు సమితి మండల మాజీ కో ఆర్డినేటర్ జయపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్, మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచాల రవికుమార్, నాయకులు దేవరుప్పుల పృథ్వీరాజ్, ఆకుల సాయికుమార్, ఎలిమినేటి శంకర్ రెడ్డి, పంజాల మహేష్ గౌడ్, బోయిని కృష్ణ, దేవరకొండ శ్రీనివాస్, దొంతిరెడ్డి శ్రీనివాస్, కాటమయ్య గౌడ్, మర్రి వెంకటేష్, మర్రి శ్రీకాంత్, సతీష్ గౌడ్, ఎల్లస్వామి, గోరుకంటి శివకుమార్, పెరబోయిన నరేష్ యాదవ్, టంటం గణేష్, గడ్డం శేషాద్రి పాల్గొన్నారు.