మోటకొండూర్, అక్టోబర్ 06 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రశాంతంగా నిర్వహించాలని మోటకొండూర్ ఎంపీడీఓ ఇందిరా అన్నారు. సోమవారం మండలంలోని ఎమ్మార్సీ భవనంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఎన్నికల నిర్వహణపై పలు సలహాలను, సూచనలను చేశారు. ఎన్నికలు బ్యాలెట్ రూపంలో ఉంటాయని, పోలింగ్ బూత్ లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు హేమంత్ కుమార్, శ్రావణ్, ఎంపీఓ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ యశోద, పోలింగ్ అధికారులు పాల్గొన్నారు.