భూదాన్ పోచoపల్లి, సెప్టెంబర్ 19 : భూదాన్ పోచoపల్లి మండలంలోని దోతిగూడెం ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ హయత్ నగర్ ఆధ్వర్యంలో పాఠశాలలోని 55 మంది విద్యార్థులకు సుమారు రూ.20 వేల విలువ గల టైలు, బెల్టులు, ఐడి కార్డులు, పెన్నులు, పెన్సిల్స్, టీఎల్ఎం మెటీరియల్ను శుక్రవారం అందజేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ హయత్ నగర్ అధ్యక్షుడు డి.పాపారావు గౌడ్, కార్యదర్శి జి.మల్లారెడ్డి, పాఠశాల హెచ్ఎం అశోక్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, గ్రామస్తులు ముద్ధం సత్యం యాదవ్, ప్రసాదం విష్ణు, బాలం మల్లేశ్ యాదవ్, బద్దం వెంకట్ రెడ్డి, బాల్రెడ్డి, పగిల యాదిరెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పగిళ్ల మల్లారెడ్డి, శ్రీనివాస్, దేవా ప్రసాద్, మాణిక్ రెడ్డి, నాగ శంకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకట్రెడ్డి, బాలస్వామి పాల్గొన్నారు.