బీబీనగర్, ఫిబ్రవరి 05 : బీబీనగర్ మండలంలోని పడమటి సోమారం గ్రామంలో ఉన్న ప్రముఖ ఆలయం శ్రీ లింగబస్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సందిగారి బస్వయ్య, ఈఓ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొట్టొళ్ల శ్యామ్ గౌడ్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ గడ్డం బాలకృష్ణ గౌడ్, మాజీ ఎంపీటీసీ బొమ్మగోని బస్వయ్య గౌడ్, దేవాలయ మాజీ చైర్మన్లు యర్రబొతు శ్రీనివాసరావు, ఆల్వా వీరారెడ్డి, ఆల్వా రామకృష్ణ రెడ్డి, ఆలెటి రాంకొండల్, కుంభం సుభాష్ గౌడ్, ధర్మకర్తలు ఆలెటి బలరాం, ఆల్వా గోపాల్ రెడ్డి, నడికుడి వెంకటేష్, కుంభం భాస్కర్ గౌడ్, దాసరి బస్వయ్య, వాకిటి మల్లారెడ్డి, వాకిటి యాదిరెడ్డి, తలబోయిన కృష్ణ యాదవ్, ఆలయ పూజారి ఎలమంచి రాజశేఖర్ శర్మ పాల్గొన్నారు.