రాజాపేట, జూలై 24 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించి కొండంత అభిమానాన్ని చాటుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, నాయకులు ఎర్రగోగుల జస్వంత్, ఠాకూర్ ధర్మేందర్ సింగ్, భోగ హరినాథ్, గుర్రం నరసింహులు, బొంగోని ఉప్పలయ్య గౌడ్, బెడిద వీరేశం, నరేశ్ రెడ్డి, రాములు నాయక్, లక్ష్మణ్ నాయక్, బాలకృష్ణ, సురేశ్, రాజు పాల్గొన్నారు.