యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 18 : బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో పార్టీ మద్దతుతో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. సవాళ్లు ఎదురైనప్పటికీ, గ్రామ స్థాయిలో బీఆర్ఎస్కు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి జిల్లాలో 161 మంది సర్పంచులు గెలిచినందుకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది సర్పంచులు గెలిస్తే కూడా అధికార బలంతో దుర్వినియోగం చేసి వారు ఓడినట్లుగా చూపించారు. వారి కోసం కోర్టు వెళ్లనున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు స్పీకర్‌కు కనిపోయించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏది చేబితే స్పీకర్ అదే చేస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడ కాదు మగ కాదు అని దుయ్యబట్టారు. 70 సంవత్సరాల వయస్సున పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్, మంత్రి చేసి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
కల్యాణ లక్ష్మీ పథకంలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఉన్న పుస్తెలు ఎత్తుకపోయే రకాలు అన్నారు. ప్రభుత్వ పథకాలు అనేవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్త సొమ్ము కాదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతున్నరు, వారికి అండగా ఉండి కాపాడుకుంటామని మరోమారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.