రామన్నపేట, నవంబర్ 25 : రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసపు హామీలను అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయక పోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా లారీకి 1.5 క్వింటాలు కోతలు పెట్టి వేధిస్తున్నారన్నారు. మండల కేంద్రంలో 100 పడకల దవాఖాన భవనానికి, అలాగే శ్రీ చెన్నకేశ్వరస్వామి దేవాలయానికి రూ.2.5 కోట్లు మంజూరు చేయించి శంఖుస్థాపనలు చేసినా నేటికి పనులు ప్రారంభించలేదన్నారు. కేసీఆర్ 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారని, రేపంత్ ప్రభుత్వం మాత్రం సంఘబంద సభ్యులకే చీరెలు పంపిణీ చేస్తుండడంతో హహిళలు గ్రామాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు కాలయాపన చేయడంతో గ్రామాలు నిర్వీర్యం అయ్యాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సర్వేలో బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలిందన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యమత్యంగా పనిచేసి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోశబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, రైతు సమస్వయ సమతి మండల మాజీ అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, వేమవరపు సుధీర్ బాబు, దోమల సతీశ్, గొరిగే నర్సింహ్మ, పున్న వెంకటేశం, బద్దుల రమేశ్, మాజీ సర్పంచులు మెట్టు మహేందర్‌రెడ్డి, కోళ్లస్వామి, బందెల యాదయ్య, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పోతరాజు సాయికుమార్, జాడ సంతోష్, నాయకులు ఎస్కే చాంద్, ఇడెం శ్రీనివాస్, బత్తుల వెంకటేశం, గర్దాసు విక్రమ్, పోతరాజు శంకరయ్య, ఆవుల నరేందర్, కోళ్ల కిషన్, మామిండ్ల అశోక్, బండ శ్రీనివాస్‌రెడ్డి, ఆవుల శ్రీదర్, బొల్లం సతీశ్, జంగిలి నర్సింహ్మ పాల్గొన్నారు.