భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 23 : అసంపూర్తిగా నిలిచిపోయిన జూలూరు – రుద్రవెల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు నరోత్తం రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ చేశారు. శనివారం భూదన్ పోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామ శివారులో గల జూలూరు- రుద్రవెల్లి మూసీ బ్రిడ్జిపై బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట, బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్, భువనగిరికి వెళ్లేందుకు ప్రధాన రహదారి అని, వర్షాలతో వాగుల ఉధృతికి మూసీ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయి పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమాలకే పరిమితo అయ్యారని, అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. బ్రిడ్జి నిర్మాణ విషయమై ప్రభుత్వ అధికారులు, పాలకులకు పలుసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం మండల డిప్యూటీ తాసీల్దార్ నాగేశ్వరావుకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి, మండల అధ్యక్షుడు మేకల రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు ఎన్నం శివకుమార్, సురికంటి రంగారెడ్డి, చిక్కా కృష్ణ, మేకల చొక్కారెడ్డి, గంజి బసవలింగం, జిల్లా కౌన్సిలర్ మెంబర్ పల్లెకాడి బసవయ్య, మండల ఉపాధ్యక్షుడు సుర్వి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి విజయ్, బీజేవైఎం అధ్యక్షుడు చంద్రవాస్ శ్రీకాంత్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు డబ్బికార్ సాహేష్ కుమార్, జనరల్ సెక్రటరీ గొలనుకొండ ప్రభాకర్, నాయకులు బైరు వెంకటేశ్, తండ రమేశ్, ఎర్ర లక్ష్మణ్, ఏలే శ్రీను, చింతల ఉపేందర్, తుమ్మ లక్ష్మీనారాయణ, వెంకటస్వామి, జంగయ్య, వెంకటేశ్, సత్యనారాయణ, అంబదాస్, సుశీల, సాయిలు, మణికంఠ, నరసింహ, వంశీ, లింగస్వామి, బాలరాజు, జగదీశ్, భాను, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Bhoodan Pochampally : జూలూరు – రుద్రవెల్లి బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి : నరోత్తం రెడ్డి