భూదాన్ పోచంపల్లి, జూలై 15 : భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముకి గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఈ నెల 18న దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ లకు బీఎస్సీ, ఎంపీసీ, ఎం ఎస్ సి, బి జెడ్ సి, ఎం జెడ్ సి, బీకాం సిఏ, బీకాం జి పి ఏ, ఎస్టీలకు ఎంపీసీ -1, బీకాం జి 2, మైనార్టీ బి జెడ్ సి -1 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు స్క్రీనింగ్ పరీక్షకు ఈ నెల 18న ఉదయం 9 గంటల లోపు సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు, కంటి చూపు, రన్నింగ్ షూస్, దుస్తుల నియమావళి, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, విద్యార్హత ఇంటర్మీడియట్ మార్కుల మెమో, ఎస్ఎస్సి, ఆధార్ కార్డ్, అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని, అన్ని స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఖాళీ సీట్ల లభ్యతకు లోబడి మాత్రమే ప్రవేశం కల్పించబడుతుందని తెలిపారు.