రాజాపేట, నవంబర్ 18 : వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారురాలతో మాట్లాడారు. ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టి ఎన్ని రోజులు అయ్యిందని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు.
నిర్మాణం కోసం ఇసుక ఉచితంగా ఇస్తున్నారా, ఇటుక ఏ రేటుకి కొనుగోలు చేస్తున్నారని, మేస్త్రికి ఎంత ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ను తక్కువ ధరకు ఇచ్చేందుకు మండలాల్లో కమిటీలు వేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయినంత వరకు బిల్లులు వచ్చాయా అని అడిగి తెలుసుకుని, మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.