Rajagopal Reddy : చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాంతో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇస్తే సరేనని, లేదంటే డైరెక్ట్‌గా ముఖ్యమంత్రినే అవుతానని అన్నారు.
తనకు మర్యాదగా మంత్రి పదవి ఇవ్వాలని, లేదంటే తానే లాక్కుంటానని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. టైమ్ వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతానని వ్యాఖ్యానించారు. అప్పుడు మునుగోడు నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన అన్నారు. రాజగోపాల్‌రెడ్డి మాటలకు వారంతా కేరింతలు కొట్టారు.