యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రముఖ ఆలయం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మినారసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితి ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. వేకువ జాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారిలు తీరారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా క్యూలైన్లు నిండిపోయాయి.