– రాష్ర్ట మానిటరింగ్ ఆఫీసర్ డా.మైకెల్ సుకుమార్ క్షేత్రస్థాయి పరిశీలన
బీబీనగర్, డిసెంబర్ 23 : యాదాద్రి భువనగిరి జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన లెప్రోసి కేస్ డిటెక్షన్ కాంపెయిన్ (ఎల్సిడిసి) కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. బీబీనగర్ మండలంలోని కొండమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న ఇంటింటా సర్వేను రాష్ట్ర మానిటరింగ్ ఆఫీసర్ డా.మైకెల్ సుకుమార్, జిల్లా కుష్ఠు నిర్మూలన ప్రోగ్రాం అధికారి డా.ఎన్.వంశీకృష్ణతో కలిసి మంగళవారం పరిశీలించారు. సర్వే విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. అధేవిదంగా భువనగిరి పట్టణ పరిధిలో హన్మాన్ వాడాలో కొనసాగుతున్న సర్వేను డా.నిరోషా, డా. వినీత్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేశారు.

Bibinagar : కుష్ఠు నిర్మూలన దిశగా ఇంటింటా సర్వే
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 18 నుండి ప్రారంభమైన ఎల్సిడిసి కార్యక్రమం ఐదు రోజులు పూర్తి చేసుకుందని తెలిపారు. ఇప్పటివరకు 69,164 ఇండ్లు సందర్శించి 2,60,316 మందిని సర్వే చేసినట్లు, 298 మంది కుష్ఠు లక్షణాలు గల అనుమానితులను గుర్తించామని, వారికి నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లాను కుష్ఠు రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓలు రాములు, మాధవి, అనిత, రమేశ్ నాయక్, ఆరోగ్య సిబ్బంది, డాక్టర్లు. శ్రవణ్ కుమార్, లెప్రోసి నోడల్ పర్సన్ ప్రవీన్ కుమార్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Bibinagar : కుష్ఠు నిర్మూలన దిశగా ఇంటింటా సర్వే