ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 22 : కాంగ్రెస్ వీఓఏలకు ఇచ్చిన హామీల సాధనకు ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ధర్నాకు వీఓఏలందరూ తరలి రావాలని వీఓఏల సంఘం ఆత్మకూర్(ఎం) మండల అధ్యక్షురాలు మోలుగురి శిరీష పిలుపునిచ్చారు. బుధవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో నిర్వహించిన వీఓఏల ముఖ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఓఏలను గుర్తించి కనీస వేతనం ఇచ్చిందన్నారు. కాగా కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే కనీసం వేతనం రూ.26 వేలు చేస్తామని హామీ ఇచ్చి రెండేండ్లు కావొస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. మంత్రి సీతక్క తమకిచ్చిన హామీలపై మాట తప్పొద్దన్నారు. ఈ సమావేశంలో వీఓఏల సంఘం నాయకులు తవిటి స్వప్న, పాశం శ్యామల, సోలిపురం ఎల్లారెడ్డి, మర్యాల నాగభూషణం పాల్గొన్నారు.