భూదాన్ పోచంపల్లి, జూలై 01 : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. చేనేత రుణమాఫీ, జియో ట్యాగ్ కలిగిన అర్హులైన చేనేత కార్మికులకు చేనేత సహకార సంఘంలో నూతనంగా సభ్యత్వాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరించాలని, అర్హులైన వారందరికీ కొత్తగా జియో ట్యాగ్ నంబర్లు ఇచ్చి ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారం దీక్ష శిబిరాన్ని జిల్లా చేనేత జౌలి శాఖ ఏడీ శ్రీనివాసరావు సందర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర చేనేత, జౌలీ శాఖ మంత్రి, రాష్ట్ర చేనేత శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని, చేనేత రుణమాఫీ 15 రోజుల తర్వాత మాఫీ జరుగుతుందని హామీ ఇచ్చారు.
అనంతరం చేనేత నాయకులు కొంక లక్ష్మీనారాయణ, మిరియాల కృష్ణమూర్తి, బిర్రు ఉప్పలయ్యకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమిoపజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌలి శాఖ డీఓ రాజేశ్వర్ రెడ్డి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు చింతకింది రమేశ్, జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం, చేనేత నాయకులు భారత భూషణ్, బొమ్మ హరిశంకర్, మంగళపల్లి శ్రీహరి, కూరపాటి బాబు, ఏలే శ్రీనివాస్, వల్లందాస్ ప్రవీణ్, సీత కృష్ణ, జోగు శ్రీను, మిరియాల వెంకటేశం, కార్మికులు పాల్గొన్నారు.