– ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్
రాజాపేట, ఏప్రిల్ 25 : ఉద్యమ నాయకుడు, రాజాపేట మండలం రఘునాథపురం గ్రామ వాసి, బీఆర్ఎస్ నాయకుడు గుర్రం సిద్ధి రాములు మృతి పార్టీకి తీరని లోటు అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య అన్నారు. శనివారం రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాములు పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సటూ తిరుమలేష్. సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్, సందిల భాస్కర్ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, కట్కం వెంకటేష్, కొండం రాజు గౌడ్, రామిండ్ల నరేందర్, గుర్రం నర్సింహులు, మర్ల నాగరాజు, నల్ల అశోక్, కటకం భూషణ్, బోగ రాజు, డొంకెన మహేందర్ గౌడ్, చింతల రాజు, విష్ణు, తుంగ పృథ్దీ, గొర్రెంకల సాయి పాల్గొన్నారు.