బీబీనగర్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో రూ.15 లక్షలు, భట్టుగూడెంలో రూ.15 లక్షలు, రామునిగుండ్ల తండాలో రూ.10 లక్షలు, ఎర్రబెట్టె తండాలో రూ. 10 లక్షలు, రావిపహాడ్ తండాలో రూ.10 లక్షలు, రావిపహాడ్‌లో రూ. 10 లక్షల హెచ్ఎండీఏ నిధులతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో అవి అభివృద్ధిలో దూసుకు పోతున్నాయన్నారు. ఇటీవల వివిధ గ్రామా ల్లో అనారోగ్యంతో మృతి చెందిన 10 మందికి ఒక్కో కుటుంబానికి రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా సీఎం సహాయ నిధి నుంచి మం జూరైన రూ. 2,50,000/- చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనంతరం బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, జిల్లా స్త్రీ శిశు సంక్షే మ శాఖ స్థాయి సంఘం చైర్మన్ జడ్పీటీసీ గోలి ప్రణీతారెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి,
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీ గోరుకంటి బాలచందర్, సర్పంచ్‌లు బక్కన్న బాలమని, గగ్గెలపల్లి మాధవి, భానోతు శాంతమ్మ, భానోతు చందునాయక్, మహేశ్ బాబు, ఆవుర్ల పద్మ, ఎంపీటీసీ ముడావత్ వాణి వీరూనాయక్, నాయకులు ఎండీ అక్బర్, సోము రమేశ్, జనార్దన్ పాల్గొన్నారు.