బీబీనగర్, ఏప్రిల్ 21 : బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని మంగళవారం ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే అభినందనలు తెలియజేసి మాట్లాడారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించుకోవాలని, చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాన సత్యనారాయణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ జ్యోతి, అంగన్వాడీ టీచర్లు లోకదాసు రాధిక, ముష్కి శ్యామల, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.