బీబీనగర్, నవంబర్ 24 : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కోటీశ్వరులు అయ్యే స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం ద్వారా వారి దైనందిన ఖర్చులు తగ్గి, సామాజిక-ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందుతారన్నారు. మండలంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వం చీరలను అందజేస్తోందని, మొత్తం 13,700 చీరల పంపిణీ జరగనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ అవేస్ చిస్తీ, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, తాసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, నాయకులు గోలి పింగళి రెడ్డి, పటోల్ల శ్యామ్ గౌడ్, పంజాల రామాంజనేయులు గౌడ్, గోలి నరేందర్ రెడ్డి, గడ్డం బాల్ రెడ్డి, సురకంటి సత్తిరెడ్డి, గడ్డం బాలకృష్ణ గౌడ్, సంధిగారి బస్వయ్య, పంజాల పెంటయ్య, సామల ప్రవీణ్‌రెడ్డి, గూడూరు నిఖిల్ రెడ్డి, బద్దం వాసుదేవ రెడ్డి, ఉప్పలంచి శ్రీకాంత్, సామల ప్రవీణ్‌రెడ్డి, ఏపీఎం మీన, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.