భూదాన్ పోచంపల్లి, జులై 09 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి, పిల్లాయిపల్లి, పెద్దగూడెం, పోచంపల్లిలో పర్యటించి హెచ్ఎండిఏ, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. భువనగిరి నియోజకవర్గంలో రూ.56 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పోచంపల్లి పట్టణంలో ఐదో వార్డులో పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్నదని తెలిపారు. నియోజకవర్గంలో కొత్తగా 30 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు చెప్పారు.
కాగా జగత్పల్లి, దేశముఖి గ్రామాల్లో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుండి వచ్చే నాయకులు గ్రామాల్లో రాజకీయం చేయవద్దని, స్థానిక సమస్యలు పట్టించుకోని నాయకులు తమకు అవసరం లేదన్నారు. దీంతో అర్హులందరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్‌గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాక మల్లేశ్‌యాదవ్, పట్టణాధ్యక్షుడు భారత లవకుమార్, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నాయకులు తడక వెంకటేశ్, సామ మధుసూదన్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్‌రెడ్డి, నాయకులు తడక రమేశ్, కొట్టం కరుణాకర్‌రెడ్డి, కాసుల అంజయ్య, సురవి వెంకటేశ్, మద్ది అంజిరెడ్డి, లాలయ్య, ఫకీరు మల్లారెడ్డి, ఫకీర్ నర్సిరెడ్డి, బండారు ప్రకాశ్‌రెడ్డి, పడాల సతీశ్‌చారి, గునిగంటి రమేశ్, గుడిసె భూషణ్గౌడ్ పాల్గొన్నారు.