యాదాద్రి, భువనగిరి : హర్యానా గవర్నర్ ( Haryana Governor ) బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya ) శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ని దర్శించుకున్నారు. గవర్నర్ రాక సందర్భంగా అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దత్తాత్రేయ మాట్లాడుతూ యాదగిరిగుట్ట (Yadagirigutta) పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రంగా వెలుగుతుందని, తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని , ఆలయ మహాత్యం విశేషమైనదని పేర్కొన్నారు. దేవాలయాలను పవిత్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆర్థిక ప్రగతి పెరుగడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.